News

భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంకు ఏర్పాట్లు

189views

ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం గ్రౌండ్స్ లో జరుగుతున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం ఏర్పాట్లను ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మేళనానికి దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పాలసీ మేకర్లు హాజరుకానున్నారని..విజ్ఞాన ప్రదర్శన, వివిధ స్టాళ్లు, వర్క్‌షాప్‌లు, సమావేశాలు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు ప్రత్యేక విజిట్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 26వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని.. ప్రముఖుల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.