News

సామరస్యపూర్వక హిందూ సమాజంతోనే ప్రపంచ శాంతి : నంద కుమార్

138views

ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం సామరస్యపూర్వక, సమరసతా యుక్త హిందూ సమాజం అవసరమని ప్రజ్ఞా ప్రవాహ్ యొక్క అఖిల భారత కన్వీనర్ జె. నందకుమార్ అన్నారు. సంఘ శతాబ్ది ఉత్సవాలను ఒక వేడుకగా కాకుండా, ఆత్మపరిశీలన చేసుకునే దిశగా జరుపుకుంటున్నామని అన్నారు. సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని నాగపూర్ లోని సోమల్ వాడలో మేధావుల సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా నంద కుమార్ మాట్లాడుతూ సంఘ్ చేస్తున్న పనిపై చాలా మంది ఆకర్షితులు అవుతున్నారని, కేరళకు చెందిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అక్కితం అచ్యుతన్ నంబూద్రి కూడా సంఘ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సంఘ్ భారత దేశానికి ఆత్మ’’ అని అభివర్ణించారని గుర్తు చేశారు. అలాగే, కేరళకు చెందిన జస్టిస్ కె.టి. థామస్ అభిప్రాయాలను ఉటంకిస్తూ, భారతదేశానికి నాలుగు ప్రధాన స్తంభాలు ఉన్నాయని అందులో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సైన్యం అని చివరిది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అని అన్నారని కూడా గుర్తు చేశారు.

గ్రీకులు, హూణులు మరియు షకాలు వంటి ఆక్రమణదారులు చివరికి భారతీయ సంస్కృతిలో కలిసిపోయారని, కానీ తర్వాత వచ్చిన ముస్లిం, బ్రిటీష్ దండయాత్రలతో యుద్ధాలతో పాటు సాంస్కృతిక, సైద్ధాంతిక ఘర్షణలు కూడా తెచ్చిపెట్టాయన్నారు.ఆ క్లిష్ట కాలంలో, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, యోగి అరబిందో, దయానంద సరస్వతి, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులు సమాజాన్ని మేల్కొల్పడానికి కృషి చేశారని గుర్తు చేశారు.

డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆలోచనలను ప్రస్తావిస్తూ, కులం, వర్గం, వర్గాలకు అతీతంగా మొత్తం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడమే తన లక్ష్యమని నంద కుమార్ పునరుద్ఘాటించారు.సమాజం దాని సంప్రదాయాలు, వ్యవసాయ వ్యవస్థ మరియు జీవనశైలి ఆధారంగా పనిచేసేప్పుడే నిజమైన స్వేచ్ఛ దొరుకుతుందని తెలిపారు.

శక్తి ఆధారిత దేశం, భాష ఆధారిత బహుళ జాతీయత వంటి భావనల మధ్య, భారతదేశం అనాది కాలం నుండి ఉనికిలో ఉన్న ఒక సంపన్న ‘సాంస్కృతిక దేశం’గా ఆయన అభివర్ణించారు. ఇక.. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా సంఘ్ తీసుకొచ్చిన పంచపరివర్తన్ గురించి కూడా నంద కుమార్ ప్రస్తావించారు. సంఘ్ లో కుల ప్రస్తావనే వుండదని, ఎవ్వర్ని ఎవరూ కులం గురించి అడగరని, విభేదాలను తుడిచేయడం ద్వారా సమాజం ఐక్యంగా వుండాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు.