News

బంగ్లాదేశ్‌లో.. రెండు వీసా కేంద్రాలను మూసివేసిన భారత్‌

Foreign Secretary Vikram Misri during talks with his Bangladeshi counterpart Mohammad Jashim Uddin and other delegates on Monday, December 9 | PTI
316views

బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆందోళనలు జరిగిన నేపథ్యంలో భారత్‌ కీలక చర్యలు తీసుకుంది. అక్కడి రెండు వీసా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఢాకాలోని వీసా కేంద్రాన్ని ఇటీవల మూసివేయగా.. దాన్ని తిరిగి తెరిచినట్లు సమాచారం.

‘‘భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాజ్‌షాహి, ఖుల్నాలలోని భారత వీసా కేంద్రాలను మూసివేస్తున్నాం. గురువారం షెడ్యూల్‌ అయిన అపాయింట్‌మెంట్లకు మరో తేదీలో అవకాశం కల్పిస్తాం’’ అని బంగ్లాదేశ్‌లోని ఇండియన్‌ వీసా అప్లికేషన్‌ సెంటర్‌ (IVAC) అధికారిక ప్రకటనలో పేర్కొంది. బంగ్లాదేశ్‌లో మొత్తం ఐదు భారత వీసా కేంద్రాలున్నాయి. ఢాకా, రాజ్‌షాహి, ఖుల్నాలతోపాటు చత్తోగ్రామ్‌, సిల్‌హెత్‌ నగరాల్లో ఈ కేంద్రాలు కొనసాగుతున్నాయి.