
113views
తొలి తెలుగు శాసనానికి ప్రతిరూపాన్ని తయారు చేసి భావితరాలకు అందించేందుకు స్వర్ణ భారత్ ట్రస్టు చర్యలు చేపట్టింది. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ఐదో శతాబ్దం నాటి తెలుగు రాతి శాసనం వెలుగు చూసింది. ఐదున్నర అడుగులు ఉన్న శాసనం దెబ్బతిని ప్రస్తుతం 4 అడుగులే మిగిలింది. గతేడాది ఇక్కడ జరిగిన తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విషయం తెలుసుకొని.. స్వర్ణ భారత్ ట్రస్టు ద్వారా శాసనం ప్రతిరూపం తయారు చేయాలని ఆలోచన చేశారు. ఆ మేరకు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ చర్యలు చేపట్టారు. శాసన ప్రతిరూపాన్ని ఈ నెల 21న జానుమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో కడపలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర ప్రాంగణంలో అధికారికంగా ఆవిష్కరించనున్నారు





