
ప్రజాభిప్రాయాన్ని సేకరించి, రికార్డు చేస్తున్న సమయంలో ముస్లిం యువకులు ఆమెను నానా దుర్భాషలాడారు. అంతేకాకుండా ఆమె ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందంటూ ఆరోపణలకు దిగారు. ఢిల్లీలోని జామామసీదు రోడ్డు వద్ద యూపీ ప్రభుత్వం గురించి ఓ వ్యక్తి అభిప్రాయాన్ని సేకరిస్తుండగా ఇది జరిగింది. ఇదే సమయంలో ముస్లిం యువకుడు వచ్చి ఆమెను దుర్భాషలాడడం ప్రారంభించారు.
ఆ వీడియోలో ముగ్గురు ముస్లిం పురుషులు ఒకే మోటార్ సైకిల్ పై వస్తున్నట్లు కనిపించింది, వారిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు. వారు వెంటనే రిపోర్టర్ పై దుర్భాషలాడడం ప్రారంభించారు. వారిలో ఒకరు ఆమె మైక్రోఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించగా, మరొకరు ఆమెను వీడియో తీసి, ఆమె ఏ మీడియా సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తుందని పదే పదే అడిగారు. అంతేకాకుండా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందన్నారు. హిందూ ముస్లింల మధ్య సమస్యలను సృష్టిస్తోందని, ఆమె ఓ చెత్త మీడియా సంస్థకి ప్రతినిధి అంటూ ముస్లిం యువకులు రెచ్చిపోయారు. మధ్యలో ఓ స్థానికుడు జోక్యం చేసుకున్నా.. యువకులు రెచ్చిపోయారు.
ఇదేమీ మొదటిసారి కాదంటున్న మహిళా రిపోర్టర్
ఇలాంటి ఘటన తనకు కొత్త కాదని, గతంలోనూ జరిగాయని నిషాపాల్ పేర్కొంది. ఇలాంటి వ్యక్తులు తరుచుగా వచ్చి, వాతావరణాన్ని ఎలా పాడుచేస్తారో దీనిని బట్టి తెలుస్తుందని, మాటలతో కూడా తిడతారని వెల్లడించింది.వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, అసభ్యంగా ప్రవర్తిస్తారు. మమ్మల్ని దుర్భాషలాడిన తర్వాత, హిందూ-ముస్లిం విభజనలు సృష్టిస్తున్నామని నిందలు వేస్తున్నారు.’’ అని వాపోయింది.





