News

మౌలానాను కొరడాతో కొట్టిన మహిళ.. వీడియో వైరల్

108views

యూపీలోని అమేథీలో ఓ మౌలాలను మహిళను కొరడాతో కొడుతున్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మౌలానా హసీబ్ 15 ఏళ్త బాలికపై అత్యాచారం చేయడంతో మహిళ ఈ పని చేసింది. కొరడాతో విపరీతంగా కొడుతూ… చంపేస్తానంటూ మహిళ ఆగ్రహించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

‘‘గత ఐదు నెలలుగా నా పిల్లల జీవితాన్ని సర్వ నాశనం చేశావు. నిద్ర పట్టడం లేదు. నా పిల్లలని చెడుగా చూస్తున్నావ్. ఇలా చేయమని ఎవరు చెప్పారో చెప్పు. 15 ఏళ్ల నా కూతురి నోట్లో గుడ్డలు కుక్కి, అత్యాచారం చేశావు. నీ పనుల చిట్టా అంతా నా దగ్గర వుంది. ఆధారాలూ వున్నాయి. ఒక్కసారి అరిచానో పది మంది వస్తారు’’ అంటూ తీవ్ర ఆగ్రహంతో మహిళ మౌలానాను కొరడాతో కొట్టింది. దీంతో మౌలానా తనను విడిచిపెట్టమంటూ వేడుకున్నాడు.

మరో ఈ ఘటనపై గోరక్షా వాహిని కార్యకర్తలు, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కేసు నమోదైంది.