
సమర్థ భారత నిర్మాణం కోసం కలిసి నడుద్దామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ దక్షిణ భారత్ ప్రచారక్ జి.భరత్ పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుకుదిటి పాలెంలో ఉన్న NER స్కూల్ గ్రౌండ్ లో ఆ స్కూల్ డైరెక్టర్ నడుకుదిటి తేజ అధ్యక్షతన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనం కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ దక్షిణ భారత్ ప్రచారక్ భరత్ కుమార్ జి, ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ముఖ్య ప్రవచనకర్తగా ఆనందాశ్రమ పిఠాధిపతి స్వామి శ్రీనివాసనంద సరస్వతి పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి భరత్ మాట్లాడుతూ పురాణాలు, ఇతిహాసాలు,సంప్రదాయాల ప్రభావంతో సనాతనధర్మం ప్రారంభమైందని, భారతదేశ సమైక్యతకు ప్రతి రూపం హిందూ సమ్మేళనం అన్నారు. ప్రతి మనిషి వారి విధానాలు సక్రమంగా అలవర్చుకోవాలన్నారు. అప్పుడే సంప్రదాయం ఉంటుందన్నారు. సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు.

ఈ సందర్బంగా హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఈ సభలో NER స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కోలాటం, తప్పిడగుళ్ళు వంటివి ప్రదర్శించారు.





