News

పాఠ్యాంశంగా భగవద్గీత కేంద్రంతో చర్చిస్తా : కుమారస్వామి

164views

పాఠ్యాంశాల్లో భగవద్గీతను చేర్చే అంశంపై కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో చర్చిస్తానని కేంద్ర మంత్రి హెచ్ఎ కుమారస్వామి హామీ ఇచ్చారు. కర్ణాటకలోని శివమొగ్గ ఇక్కడ జరిగిన శ్రీ భగవద్గీత అభియాన్ కార్యక్రమంలో భగవద్గీతను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని బీజేపీ నాయకుడు కె.ఎస్.ఈశ్వరప్ప చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఒక్క పాఠశాల స్థాయిలోనే కాదు.. కళాశాలల్లో, విశ్వవిద్యాల స్థాయిలోనూ గీత బోధను తప్పనిసరి చేసే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి చెప్పారని ప్రకటన పేర్కొంది. అం తేకాదు.. పాఠశాల స్థాయిలో రామాయణం, మహాభారతాలను బోధించాలని కూడా ఆయన సూచించారని వెల్లడించింది. సమాజంలో హింస, అశాంతిని తొల గించడానికి ఇతిహాసాలను బోధించడం అవసరమన్నారు. ఉడిపిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భగవద్గీత పారాయణం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. పిల్లలకు చిన్నతనం నుంచే భగవద్గీతను నేర్పించాలని, రామాయణం, మహాభారతాల గురించి చెప్పాలని ఉద్ఘాటించారు.