News

సనాతన ధర్మంలో సంగీతానికి విశేష ప్రాముఖ్యత

154views

సనాతన భారతీయ ధర్మంలో సంగీతానికి విశేష ప్రాముఖ్యత ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరు బృందావన్‌గార్డెన్‌న్స్‌లోని ఆయన కార్యాలయంలో జై కిసాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈనెల 13న శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న ద్వితీయ అన్నమయ్య సహస్ర గళార్చన కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంగీతంలో మనుషులతోపాటు పశుపక్షాదులు ఓలలాడతాయని పేర్కొన్నారు. అన్నమయ్య సహస్ర గళార్చన నిర్వాహకులు బండ్లమూరి స్వామి మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో హిందూ ధర్మం అంటే సన్మార్గమని అన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించే ఒక జీవన విధానమని చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సేవలో భాగంగా రాష్ట్రస్థాయిలో వందల మంది గాయకులతో ద్వితీయ అన్న మయ్య సహస్ర గళార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7799800900 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.