
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం గ్రామీణ మండలం చాపురం పంచాయతీలోని సిద్దిపేట (SC గ్రామం) లో ముగ్గుల పోటీలు, భజన, దేశ భక్తి గీతాలు పాడడం, వక్తల ఉపన్యాసాలు, బహుమతి ప్రదానం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కాకుండా సాధారణ గృహిణులు అయినా కూడా వారు ఎంతో స్ఫూర్తివంతమైన, కళాత్మకమైన, దేశభక్తి ప్రేరకమైన ముగ్గులు వెయ్యడం, దేశభక్తి గీతాలు పాడడం అక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. గ్రామీణ మహిళలలో ఇలాంటి చైతన్యానికి కారణమైన సమరసతా సేవా ఫౌండేషన్ ను వారంతా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జడ్జి శ్రీ యలమంచిలి గన్నయ్య, MPTC & యూత్ ప్రెసిడెంట్ శ్రీ అల్లు భాస్కర్ రావు, SSF జిల్లా ధర్మ ప్రచారకులు శ్రీ TPV జగన్నాధం, శ్రీకాకుళం డివిజన్ co-కన్వీనర్ శ్రీ చల్లా దుర్గారావు, మండల కన్వీనర్ శ్రీ రుప్ప రమణ మూర్తి, మహిళా కో కన్వీనర్ శ్రీమతి సవదాన దాలమ్మ, SC/ST మండల సభ్యులు శ్రీ Y.రామారావు గారు, గ్రామ HDPS కన్వీనర్ శ్రీ Y.చల్లయ్య గారు, భజన గురువు శ్రీ S.రామలక్ష్మణ్, గ్రామ మహిళ కన్వీనర్ శ్రీమతి యలమంచిలి నీలవేణి, గ్రామ పురోహితులు శ్రీ వెంకట శర్మ, మన్నయ్య పేట పూజారి శ్రీ శ్రీనివాస్, గ్రామ కమిటీ, మహిళలు, విద్యార్థులు & మండలధర్మ ప్రచారక్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.