News

పిఠాపురంలో ఒక్కటై కదలిన హిందూ సంఘాలు

1.8kviews

పిఠాపురం పట్టణంలో హిందూ సంఘాలు ఒక తాటి మీదకు వచ్చి గళం విప్పాయి. పిఠాపురంలోని పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. 4 రోజుల క్రితం పట్టణంలోని పలు హిందూ ఆలయాలలో దేవి దేవతల విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం పాఠకులకు విదితమే.

దీంతో ఆగ్రహించిన హిందువులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విశ్వహిందూ పరిషత్, ఆర్ ఎస్ ఎస్, భారతీయ జనతా పార్టీ, శివశక్తి, పిఠాపురం బ్రాహ్మణ పరిషత్, అర్చక సంఘం, పిఠాపురం మన బాధ్యత తదితర సంస్థల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలలో పాల్గొన్నారు. హిందూ ఆలయాలను పరిరక్షించాలని, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని ఖండించాలని నినదించారు.

 విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించాలని, పట్టణంలో గస్తీ పెంచాలని కోరారు. సంఘటన జరిగి మూడు రోజులయినా నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలం కావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో నిందితులను గుర్తించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు. అనంతరం సీఐ శ్రీ బి ఎస్ అప్పారావును కలిసి వినతి పత్రం అందజేశారు. కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు స్థానిక పురాతన రామాలయం ఆవరణలో నాయకులు సమావేశం నిర్వహించారు. హిందూ ఆలయాలపై ఒక పథకం ప్రకారం జరుగుతున్న దాడులను నాయకులు ఖండించారు. దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గస్తీని పెంచాలని వారు కోరారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.