
నంద్యాల జిల్లా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల స్థలాన్ని ఉర్దూ కో ఎడ్యుకేషన్ కళాశాల కేటాయింపుకు నిరసనగా కలెక్టర్ ఆఫీసు ఎదుట భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో మెమోరాండం సమర్పించారు.
యస్ వై వీ సీ పీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (టెక్కె) స్థలాన్ని ఉర్దూ కో ఎడ్యుకేషన్ కళాశాలకు ఎలా కేటాయిస్తారు? అని బాలికల కళాశాలలో ఉర్దూ కో ఎడ్యుకేషన్ కళాశాల తరగతులు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల స్థలాన్ని ఉర్దూ కో ఎడ్యుకేషన్ కళాశాలకు కేటాయించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఏబీవీపి తీవ్రంగా వ్యతిరేకిస్తూ కళాశాల విద్యార్థినులుతో కలిసి ధర్నా నిర్వహించారు.
గత కొద్ది కాలంగా ఉర్దూ కళాశాల సొంత భవనాల పనులు జరుగుతున్నాయన్న నెపంతో, తాత్కాలికంగా తరగతులు స్థానిక టెక్కె ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహిస్తున్నారు. అది కో ఎడ్యుకేషన్ అయిన కారణంగా ప్రభుత్వ కళాశాల బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒక మహిళా కళాశాలలో ఉర్దూ కోఎడ్యుకేషన్ కళాశాల తరగతులు నిర్వహించడం, శాశ్వత భవనాలు నిర్మించే అనుమతులు మంజూరు చేయడం చాలా దుర్మార్గమైన, దురుద్దేశ పూరితమైన చర్యగా ఏబీవీపీ అభిప్రాయ పడుతుంది.

ఇది చాలదన్నట్టు ఉర్దూ కోఎడ్యుకేషన్ కళాశాలకు శాశ్వత భవనాలు బాలికల కళాశాలకు అనుబందంగా ఉన్న స్థలంలో నిర్మాణానికి కేటాయించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
కో ఎడ్యుకేషన్ కారణంగా విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని విద్యార్థినులు పలుమార్లు అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వారు తమ నిస్సహాయతను తెలియజేశారు.
కో ఎడ్యుకేషన్ ఉర్దూ కళాశాలను బాలికల కళాశాలలో నిర్వహించడం వల్ల బాలికల తల్లిదండ్రులు తమ కూతుర్ల భద్రత పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
1. బాలికల కళాశాలలో ఉర్దూ కో ఎడ్యుకేషన్ కళాశాల శాశ్వత భవన నిర్మాణాల నిర్ణయం తక్షణం ఉపసంహరించుకోవాలని.
2. ప్రస్తుతం తాత్కాలికంగా నిర్వహిస్తున్న ఉర్దూ కో ఎడ్యుకేషన్ తరగతులను తక్షణం వేరే ప్రదేశానికి మార్చాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రానున్న రోజులలో ఏబీవీపీ విద్యార్థినుల తల్లిదండ్రులతో కలిసి అంచెల వారి ఆందోళనలు చేపడుతుందని తెలియజేశారు. సదరు కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ నాయకులు సాయి,వెంకటేష్,మణి, భారీ సంఖ్యలో బాధిత కళాశాల విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.





