News

భూటాన్‌లో ‘కాలచక్ర అభిషేక’ను ప్రారంభించిన మోడీ

183views

భూటాన్‌ పర్యటనలో ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొన్నారు. థింఫులో భూటాన్ మాజీ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో కలిసి ‘కాలచక్ర అభిషేక’ను ప్రధాని మోడీ ప్రారంభించారు. చాంగ్లిమితాంగ్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ స్టేడియంలో కలియ తిరిగి అందరికీ నమస్కరించారు.

అనంతరం మోడీ మాట్లాడుతూ.. భారతదేశం-భూటాన్ మధ్య శతాబ్ధాలుగా ఆధ్యాత్మిక, సాంస్కతిక బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. భూటాన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను స్థాపించడంలో.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని మోడీ కొనియాడారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటంపై దృష్టి పెడతామని చెప్పారు. అంతకముందు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చ జరిగింది.