News

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలి

160views

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో బలంగా విస్తరించాలని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి అన్నారు. పశు సంవర్ధక శాఖ ప్రగతిపై తన క్యాంపు కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ కార్యక్రమాల అమలు, మండలాల వారీ పురోగతిపై సమీక్షించి, లక్ష్యాలను సమయానుసారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోకులం షెడ్ల లక్ష్యాల సాధనకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటి ప్రకారం మంజూరు తీసుకోవాలని సూచించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో తెల్ల జాతి పశువుల ప్రాధాన్యాన్ని గుర్తించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై పశు ఆరోగ్య కార్యకర్తలకు పూర్తి అవగాహన ఉండేలా శిక్షణ, మార్గదర్శకాలు నిరంతరం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి టి.శ్రీనివాసరావు, శాఖాధికారులు పాల్గొన్నారు.