
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంటూ వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన బందు ఆంధ్రప్రదేశ్లో మాత్రం CAA, NRCలకు వ్యతిరేకంగా ముస్లిములు జరిపిన బందుగా రూపాంతరం చెందినట్లు ఉంది.
ఇప్పటికే CAA, NRCలపై కారాలు, మిరియాలు నూరుతున్న ముస్లిములు నిరసనల పేరుతో హిందువులను, హిందూ సంఘాల ప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
తెనాలికి చెందిన సంఘ్ పరివార్ కార్యకర్త శ్రీ అవ్వారు శ్రీనివాసరావు సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తుంటారు. ఈ మధ్యకాలంలో CAA, NRCలకు వ్యతిరేకంగా జరుగుతున్న వివిధ నిరసన ప్రదర్శనలు, అల్లర్లను ప్రశ్నిస్తూ ఆయన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశారు.

అవ్వారు శ్రీనివాస రావు, ఆయనకు చెందిన ‘సూర్యా సిస్టమ్స్’ కంప్యూటర్ దుకాణంపై దాడి జరపడం ద్వారా ఆయనను, ఆయన తోటి హిందూ సంస్థల కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని వ్యూహం పన్నిన ముస్లిం యువకులు కొందరు బంద్ సందర్భంగా ఆయన దుకాణం ఎదుట గుంపు కట్టి నానా హంగామా సృష్టించారు.
శ్రీనివాస రావు, ఆయన దుకాణానికి రక్షణగా కొంతమంది ఆర్ ఎస్ ఎస్, భాజపా కార్యకర్తలు కూడా పోగవడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే అదే సమయంలో పోలీసులు, ఆ చుట్టుపక్కల దుకాణాలకు చెందిన యజమానులు కూడా అవ్వారు శ్రీనివాసరావు దుకాణం వద్దకు చేరుకుని ఆయనకు, ఆయన దుకాణానికి రక్షణగా నిలవడంతో ఆందోళనకారులు అక్కడినుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో వారు నాలుగు దఫాలుగా ఆ దుకాణంపై దాడి చేసేందుకు, శ్రీనివాస రావు పై చేయి చేసుకునేందుకు యత్నించడం గమనార్హం.
అవ్వారు శ్రీనివాస రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా తోటి వ్యాపారులందరూ శ్రినివాసరావుకి అండగా నిలవటం గమనార్హం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





