ArticlesNews

పంచపరివర్తన్

167views

సంఘ శతాబ్ది సందర్భంగా పూజ్య సర్ సంఘచాలక్ జీమోహన్ భాగవత్ సామాజిక పరివర్తన కోసం ఐదు అంశాలలో మార్పు కోసము పిలుపునిచ్చారు. సంఘటిత కార్యశక్తి నిర్మాణం దీని ఆధారంపైనే వుంది. సామాజిక పరివర్తన జరగకుండా వ్యవస్థ పరివర్తన జరగదు. సామాజిక పరివర్తన అనగా సామాజిక జీవనంలో పరివర్తన దీనివలన సమాజం గుణసంపన్నంగా మరియు సంఘటితం అవుతుంది. దీనిని ఆచరణ లో స్వయం సేవక్ ద్వారా అతని కుటుంబం ఆచరణ ద్వారా ఇరుగు పొరుగు వారి సహభాగిత్వంతో సామాజిక పరివర్తన రావాలి. స్వయం సేవక్ ఆచరణ సమాజం అందుకోవడానికి మధ్య అంతరం తగినంతగానే ఉండాలి. అందుకోసం ఐదు అంశాలు పంచపరివర్తన్ గా స్వయం సేవక్ స్వీకరిస్తున్నాడు.

(1) కుటుంబ ప్రబోధన్ :- కుటుంబ సభ్యులు అందరూ కలిసి మన కులరీతి, ధర్మం, సంస్కారం లాంటి విషయాలపై లోతుగా చర్చించుకోవాలి. నేటి సమాజం ఏ మార్ప కోరుతోంది? మనం ఎలా ఉన్నాము ? ఏ మార్పు రావాలి? అని. నేను నా కుటుంబం దేశానికి, ధర్మానికి ఏమి చేయగలము అని చర్చ జరిగి తీసుకున్న నిర్ణయం అమలు చేయాలి. వ్యక్తి నిర్మాణం కుటుంబం ద్వారానే జరుగుతుంది.

(2) పర్యావరణం :- ఈ విషయం అందరికీ తెలుసు ప్రజలు వెంటనే దీనిని అనుసరిస్తారు కూడా. విధాన పరమైన మార్పులు చాలా పెద్దవి. అలా మారడానికి సమయం పడుతుంది. సమాజం చాలా ముందుకు వెళ్లింది. అకస్మాత్తుగా మారడం అంటే, మలుపు తిరగడం అంటే బోల్తా పడుతుంది. అందుకే మార్పులు క్రమ క్రమంగా చేయాల్సి వుంటుంది. కానీ చిన్న చిన్న పనులను మాత్రం వెనువెంటనే చేయాలి. నీటిని ఒడిసిపట్టడం, సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడం, పచ్చదనం కోసం చెట్ల పెంపకం ప్రజలు దీన్ని ఉత్సాహంగా చేస్తారు. ఇది పర్యావరణాన్ని మెరుగుపరచడమే కాకుండా మానవత్వాన్ని కూడా పెంచుతుంది

(3) సామాజిక సమరసత :- సమానత, సమత మాట్లాడటం
చేయాలి. పరిచయం అయిన వ్యక్తి రూపం బట్టి, పేరు బట్టి ఇతను మరియు వ్యాపారం చేసే ప్రదేశంలో అందరితోను, వారి మరియు స్మశానం వద్ద సమానతతో ఉండాలి. ఇది కాస్త సులభం. కానీ అసమానత ఎక్కడ వుందో చూడటం కష్టం. ఏ ఒక వ్యక్తిని చూసినప్పుడు లేదా అతని పేరు విన్నప్పుడు, అతను ఏ తప్పు. మనిషిని మనిషిగా చూడాలి కులం కోణంలో చూడటం ఇది మనస్సు నుంచి వెళ్లిపోతుంది. సమాజం మొత్తాన్ని కులాలకు సంబంధించిన వారూ వుండాలి. 2 కుటుంబ వుండాలి, 4. పర్వదినాలు, పండగలతో పాటు కష్ట సుఖాల్లో భాగం కొన్ని సంవత్సరాల్లోనే ఇది సాధ్యపడుతుంది. అలాగే, సమాజంలోని స్థలాలు అందరికీ సమానంగా తెరిచి ఉండాలి. అక్కడ ఎలాంటి భక్తుడి కులం అడగరు. నీరు అందరికీ ఉంటుంది. చనిపోయిన
సులభం ఆచరణ కష్టమైనా చేయాలి దానికి మనసు సంసిద్ధత ఫలానా అనే అంచనా వేయకూడదు. ఇంటివద్ద, కార్యలయం కుటుంబాలతోను స్మేహపూర్వకంగా మెలగాలి. మందిరం, నీటిబావి కష్టమైన పని. కానీ చేయాల్సిందే. సమానత్వం అని మాట్లాడటం వ్యవస్థలోనూ ఇది లేదు. మనిషి మనస్సులో అసమానత వుంది. కులానికి చెందినవాడో అని ఎవరైనా వెంటనే ఆలోచిస్తే అది అసమానతకు మూల కారణం. ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా ఒక్కటిగానే పరిగణించాలి. దీని కోసం 1. మన స్నేహితులంటే అన్ని పరంగా కూడా సంబంధాలుండాలి, 3. వారి ఇళ్లకు వెళ్లి వస్తూ పంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా అంతరాలు తగ్గుతాయి. దేవాలయాలు, శ్మశానవాటికలు, నీటి వనరులు వంటి ప్రజా వివక్షత ఉండకూడదు. ఆలయం భక్తుల కోసమే, తర్వాత కూడా వివక్ష ఎందుకు ఉండాలి?

(4) ‘స్వదేశీ’ స్వావలంబన :- మన ఇంటిలో స్వభాష, స్వభూషణ్, భోజన్, భ్రమణ్ మరియు భవన ఇవి మనవై ఉండాలి. మనం
అభివృద్ధి చెందాలంటే ప్రతి అంశంలోనూ స్వావలంబన సాధించాలి. మన ఇంటి నుంచే ప్రారంభించాలి. స్వదేశీ అంటే విదేశీ ఉ త్పత్తులను పూర్తిగా నిలిపేయడం అని కాదు. అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగుతుంది కానీ.. ఒత్తిడితో కాదు. పూర్తి స్వచ్ఛందంగా. ఉదాహరణకు… 1. వేసవిలో నిమ్మకాయలతో మనం షరబత్ చేసుకోవచ్చు. కోకో కోలా, ఎందుకు తెచ్చుకోవాలి?, 2. పౌష్టికాహారం ఇంట్లోనే వండుకోవచ్చు. కానీ పదే పదే పిజ్జా, బర్గర్ ఎందుకు?, 3 మన గ్రామంలోనే ఏ వస్తువైనా తయారయితే… ఆ వస్తువును బయటి నుంచి ఎందుకు తెచ్చుకోవడం? స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేస్తే, అక్కడ ఉద్యోగ అవకాశాలు దొరకుతాయి, 4. మన దేశంలోనే కార్లు తయారైతే.. వాటినే కొనుగోలు చేయాలి, స్వదేశీ సారాంశం ఏమిటంటే.. మన దేశంలో ఏవైతే తయారవుతాయో మాటిని మాత్రమే కొనుగోలు చేయడం. మన దేశంలో తయారు కాని వాటిని విదేశాల నుంచి కొనుగోలు
చేయవచ్చు.

(5) పౌరనియమాలు :- రాజ్యాంగ, చట్టం పెట్టిన నియమాలు అతిక్రమించకూడదు. చట్టాన్ని మన చేతులలోనికి తీసుకోకూడదు. నిత్యజీవితంలో దేశభక్తి ఆచరణ అంటే సమయానికి మనం చెల్లించవలసిన పన్నులు. బిల్లులు చెల్లించాలి. నిరసన తెలియజేయాలనుకుంటే చట్టప్రకారం చేయాలి. శాంతియుతంగా చేయాలి. బిల్లులు సకాలంలో చెల్లించాలి. లైసెన్స్ సమయం ప్రకారం రెన్యువల్ చేసుకోవాలి. చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనదు. ఇదే దేశభక్తి అంటే. దేశం కోసం జీవించడమే నిజమైన దేశ భక్తి, మన పూర్వజులు దేశం కోసం ప్రాణాలర్పించేవారు. ఈ కాలంలో 24గంటలూ దేశం కోసమే జీవించాలి. ఈ అయిదు విషయాలు మన ఆచరిస్తూ సమాజంలో అగ్రేసరులుగా నిలవడమే.