News

ఆన్‌లైన్‌లో శబరిమల అయ్యప్ప ప్రసాదం

313views

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. ఆన్‌లైన్‌ ద్వారా తమ ఇంటి నుంచే స్వామివారి ప్రసాదాలన్నింటినీ బుక్‌ చేసుకునే సదుపాయం మరో నెలలో అమలులోకి రానుంది. ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు లాంఛనంగా ప్రారంభించిన కౌంటర్‌ బిల్లింగ్‌ మాడ్యూల్‌ సాయంతో శబరిమలతో పాటు త్వరలో ట్రావెన్‌కోర్‌ సంస్థానం పరిధిలోని 1252 దేవాలయాల ప్రసాదాలనూ భక్తులు తమ ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. శబరిమల లాంటి రద్దీగా ఉండే దేవాలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుందని దేవస్థానం తెలిపింది. కౌంటర్‌ బిల్లింగ్‌ మాడ్యూల్‌ ఒక నెలలోపు పని చేయడం ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా దేవస్వం బోర్డు అధ్యక్షుడు తెలిపారు.