News

కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఆదర్శమూర్తులు

254views

వాస్తవ చిత్రాలను తన అక్షర అస్త్రాలుగా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి, మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ నేడు మనకు ఆదర్శమూర్తి అని మాజీ శాసనసభ్యులు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ మల్లాది విష్ణు కొనియాడారు.శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతిని పురస్కరించుకుని బుధవారం గవర్నర్ పేట లెనిన్ సెంటర్ నందు కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠం అవార్డు గ్రహీత అయిన ఆయన ‘కవి సామ్రాట్’ బిరుదాంకితులనీ, ఆయన రాసిన ‘రామాయణ కల్పవృక్షము’ అనే రచనకు జ్ఞానపీఠం అవార్డు లభించిందన్నారు. ఆయన కవిత్వం, నవలలు, నాటకాలు, చిన్న కథలు, ప్రసంగాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో విస్తృతమైన రచనలు చేశారని చెప్పారు.ఆయన విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీ లో పనిచేశారని ఆయన మన విజయవాడ వాసి అని చెప్పారు. తెలుగు సాహిత్య చరిత్రలో తన స్థానాన్ని పదిలపరచుకొని, పదితరాల వరకు కావలిసిన తెలుగు వాఙ్మయాన్ని, అభ్యదయ కవులకు, సంప్రదాయ కవి శ్రేష్ఠులకు ఎంతో స్ఫూర్తిని అందించిన మహనీయుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ అని కొనియాడారు.