News

హిందూ దేవాలయాల పరిరక్షణకు వీహెచ్‌పీ కృషి

211views

హిందూ దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి విశ్వ హిందూ పరిషత్‌ విశేష కృషి చేస్తుందని జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్‌ శ్రీకాంత్‌ పరండే అన్నారు. హనుమాన్‌జంక్షన్‌లోని విశ్వ హిందూ పరిషత్‌ జాతీయ ట్రస్టీ పుట్టగుంట సతీష్‌కుమార్‌ ఫామ్‌హౌస్‌కు ఆయన విచ్చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు విశ్వ హిందూ పరిషత్‌ కార్యక్రమాలు విస్తృతం చేస్తామని చెప్పారు. తొలుత పుట్టగుంట ఫామ్‌హౌస్‌లోని శ్రీకృష్ణాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, మెడివ్యాలీ హాస్పిటల్స్‌ ఎండీ పంచకర్ల చక్రవర్తి, వీహెచ్‌పీ నాయకులు దుర్గా ప్రసాదరాజు, సరిపల్లి శివకుమార్‌ రాజు పాల్గొన్నారు.