
కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలయంలోని నాదూర్ లోని AD కాలనీలో బలహీన వర్గాల నివాస గృహాలు ఉన్నాయి. కోయంబత్తూరు జిల్లాలో డిసెంబర్ ప్రారంభంలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది.
02/12/2019 న, తెల్లవారుజామున మూడు గంటలకు అందరూ నిద్రిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో గోడ కూలి, అక్కడ నివసిస్తున్న వారికి చెందిన నాలుగు ఇళ్లపై పడింది. గాఢ నిద్రలో ఉన్న వారు ఆ శిథిలాల క్రింద చిక్కుకుపోయారు.
ఈ సందర్భంలో, వివక్ష చూపడం కోసం, అడ్డు గోడ నిర్మించారని, అది ఆ ప్రాంతంలోని ఆధిపత్య కులాల వారు ఉద్దేశపూర్వకంగా నిర్మించిన గోడ అని, షెడ్యూల్ కుల ప్రజలను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని చాలా పార్టీలు తప్పుగా పేర్కొన్నాయి.
‘తమిళ టైగర్స్’ అనే సంస్థ ఆందోళన నిర్వహించి తద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించింది. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. టిపిడిఏక్ట్‌లో 25 మందికి పైగా అరెస్టయ్యారు. వారిలో కొందరికి బెయిల్ మంజూరు చేశారు, మరికొందరు జైలులో ఉన్నారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సంస్థ ప్రతినిధులు వివిధ సామాజిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు కూడా తదనుగుణంగా గుండా చట్టం కింద చర్యలకు ఉపక్రమించారు.
కొన్ని ఇస్లామిస్ట్ సంస్థల మద్దతుతో, తమిళనాడుకు చెందిన జాతీయవాద వ్యతిరేక సంస్థల మద్దతు తోనూ, ప్రస్తుతం ఈ కేసులో ఉన్నవారు ఆ ప్రాంతంలోని షెడ్యూల్ కులానికి చెందిన 80 కుటుంబాలు, అంటే 3000 మంది ఇస్లాం మతంలోకి మారుతారని ప్రచారం చేశారు. వారి ప్రభావానికి లోనైన కొంతమంది యువకులు బిబిసి వెబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.
నిజానికి అక్కడి ప్రజలు శ్రీ రంగనాథ పెరుమాళ్ భక్తులు. భజన గ్రూపులు ఉన్నాయి. కరామడై శ్రీ రంగనాథర్ ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలలో క్రమం తప్పకుండా పాల్గొనడం వారి ఆచారం.
వారి పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ బృందం అక్కడికి వెళ్ళినప్పుడు, వారు, “మేము ఎప్పటికీ మతం మారము. ఎవరో ఉద్దేశపూర్వకంగా దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు.
మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని స్పష్టత ఇవ్వడమే కాకుండా. అన్ని వర్గాల ప్రజలందరూ అన్ని విధాలా సహాయం చేశారని, ప్రభుత్వం కూడా పరిహారం ఇచ్చిందని వారు పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబానికి వారసులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు ఇప్పటికీ కోరుతున్నారు. మేం చనిపోయే వరకూ హిందూ మతంలోనే ఉంటామని వారు చెప్పారు.
వారి అమాయకత్వాన్న ఉపయోగించుకుని ఇలా మతమార్పిడులకు పాల్పడటం చాలా ఖండించదగినదని, తద్వారా శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని, కనుక దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ ప్రజల తరపున ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.