News

జమ్మూకశ్మీర్ నుంచి బలగాలు వెనక్కి

572views

మ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. నాయకులను హౌస్ అరెస్ట్ చేసి.. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించింది. ఆ తర్వాత కొద్దిరోజులకు పరిస్థితులు సాధారణ పరిస్థితికి రావడంతో అక్కడి బలగాలను తగ్గిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఇప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లో మోహరించిన 72 కేంద్ర పారామిలటరీ బలగాలను వెనక్కి పిలవాలని నిర్ణయించింది. 24 సీఆర్‌ఫీఎఫ్ కంపెనీలు, 12 దళాల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, 12 కంపెనీల సషస్త్ర సీమాబల్ దళాలు, 12 కంపెనీల ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు దళం, 12 కంపెనీల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వెనక్కు వస్తున్నాయి. బలగాలు వెనక్కి పిలిచిన తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.