
మాయమాటలు చెప్పడం ఇస్లాంలోకి మార్చడం బలవంతంగా లవ్ జిహాదీ చేయడం లేదా లాండ్ జిహాదీ చేయడం ముస్లింలకు పరిపాటి అయిపోయింది. ఎన్నోరకాల సంఘటనలు జరుగుతున్నప్పటికీ హిందూసమాజంలో ఇంకా మార్పు రావటంలేదు అనడానికి ఈ సంఘటన మరో ఉదాహరణ అయింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఓ సంచలనాత్మక మతమార్పిడి కేసు వెలుగులోకి వచ్చింది. ముజఫర్‌నగర్ జిల్లాలోని షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కినౌని గ్రామానికి చెందిన నరేంద్ర శర్మకు మత్తుమందు తినిపించి మతం మార్చారు ఆపై అతని ఆస్తిని కూడా దోచుకున్నారు. ఈ కేసులో పోలీసులు 6 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నరేంద్ర భయంకరమైన నిజాలను వెళ్లడించారు.
ముజఫర్ నగర్ జిల్లాలోని కినౌని గ్రామానికి చెందిన నరేంద్ర శర్మకి, అదే గ్రామానికి చెందిన యామిన్ కి స్నేహం కుదిరింది. ఆ తర్వాత అతను నరేంద్ర శర్మకి మాదక ద్రవ్యాలను అలవాటు చేశాడు. అలా ఓసారి తాగిన మత్తులో నరేంద్ర శర్మను అతను మతం మార్చాడు, నరేంద్ర మత్తులో మిత్రుడి మాటలను నమ్మి మతం మారి, సున్నతి చేయించుకున్నాడు. అతను తన జడను కత్తిరించుకున్నాడు. అలా మత్తులో అతన్ని మెల్లగా దింపి యామిన్ క్రమంగా నరేంద్ర ఆస్తిని తన కుటుంబ సభ్యుల పేరుమీద నమోదు చేయించుకున్నాడు. రెండు బిఘాల భూమిని ప్లాట్ చేసి అమ్మి వాహనం కొన్నాడు. ఇలా నరేంద్ర ఆస్తిని యామిన్ వాడుకున్నాడు. ఈ విషయాన్ని లేట్ గా తెలుసుకున్న నరేంద్ర వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి యామిన్ పై కేసు దాఖలు చేశాడు. ఈ కేసులో పోలీసులు యామిన్ తో సహా , గుల్జార్, ఇక్రమ్ మరియు యామిన్ మైనర్ కొడుకును అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో, నరేంద్ర శర్మ ఆస్తిని లాక్కోవడానికి తాను మతమార్పిడి చేసినట్లు యామిన్ అంగీకరించాడు. నిందుతులను మతమార్పిడి చట్టంతోపాటుగా గ్యాంగ్ స్టర్ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఆస్తిని జప్తు చేసే ప్రయత్నంలో ఉన్నారు.





