
228views
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రెటరీ జనరల్ శ్రీ మిలింద్ పరాందే మంగళగిరిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వి.హెచ్.పి. ప్రతినిధులు రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి, ధార్మిక ప్రచారం, సేవా కార్యక్రమాలపై చర్చించారు. ఈ యేడాది జనవరిలో విజయవాడ వేదికగా నిర్వహించిన హైందవ శంఖారావం డిక్లరేషన్ గురించి వి.హెచ్.పి. నేతలు వివరించారు.

ఈ సమావేశంలో వి.హెచ్.పి. అఖిల భారత ఉపాధ్యక్షుడు శ్రీ గోకరాజు గంగరాజు, ఏపీ, తెలంగాణ క్షేత్ర కార్యదర్శి శ్రీ టి.సత్య రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఒబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి శ్రీ వి.దుర్గా ప్రసాదరాజు పాల్గొన్నారు.





