
వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రూరల్ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, నగర కమిషనర్, ఆర్.డి.ఓ వారి అధ్యక్షతన,మున్సిపల్ కమిషనర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మున్సిపాలిటీ సిబ్బంది,జలవనరుల శాఖ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్,ట్రాఫిక్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖలతో పాటు విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. సమితి సూచించిన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నెల 27న రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా వారివారి గృహాలలో పూజ చేసిన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం కొరకు గణేష్ ఘాట్ వద్ద ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. 29,31వ తేదీలలో సామూహిక నిమజ్జనం , సాంస్కృతిక కార్యక్రమాలు,ప్రసాద వితరణ మరియు గంగా హారతి తదితర కార్యక్రమాలలో పాల్గొన వలసిందిగా నెల్లూరు నగర ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా వాసు గారు(శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత), విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కె.శ్రీకాంత్ గారు, గౌరవాధ్యక్షులు మహేష్ గారు, గౌరవాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, పిట్టి సత్యనారాయణ గారు, కార్యనిర్వహణ కార్యదర్శి మల్లికార్జున రెడ్డి గారు, కార్యదర్శి లు కాకు మురళి రెడ్డి గారు, హర్షవర్ధన్ గారు, వుచ్చి భువనేశ్వరి ప్రసాద్ గారు మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.





