News

మీర్జాపూర్ లో మత మార్పిళ్లు… ఫిర్యాదు చేసిన స్థానికులు

248views

యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో మత మార్పిడి ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబ్ ఆలం నివాసంలో మత మార్పిళ్లు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.ఈ సమాచారం అందుకున్న హిందూ యువ వాహిని, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకొని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలా రోజులుగా ఈ మత మార్పిళ్లు జరుగుతున్నా… పోలీసులకు మాత్రం ఎలాంటి అవగాహనా లేదు. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తన పక్కన ఇంట్లోనే వుండే మహబూబ్ ఆలం హిందువులను మతం మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాడని, మతం మారమని ప్రచారం కూడా చేస్తున్నాడని వెల్లడించారు.

మతం మార్చుకోవాలని, డబ్బులు, ఇతర ప్రలోభాలు కూడా చేస్తున్నారని, తనకు కూడా స్వయంగా ఫోన్లు వచ్చాయని వెల్లడించారు. మతం మారడానికి తాను నిరాకరించారనని, అయినా ఒత్తిళ్లు మాత్రం ఆగడం లేదన్నారు. మరోవైపు మత మార్పిడి విషయంలో తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.