News

M for Mosque.. N for Namaz అంటూ పాఠ్యపుస్తకాల్లో చేర్చిన పాఠశాల

190views

మధ్యప్రదేశ్ రైసన్ జిల్లాలోని ఓ ఆంగ్ల పాఠశాల వివాదానికి తెరలేపింది. సహజంగా వుండే “K for Kite” or “M for Mango,” బదులుగా ముస్లిం మతానికి సంబంధించిన పేర్లను పాఠ్య పుస్తకాల్లో వుంచింది. దీంతో తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

“K for Kite” or “M for Mango,” బదులుగా
K for Kaaba
M for Mosque
N for Namaz
O for Woman in Hijab అని పుస్తకాల్లో వుంచారు.

ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఈ విషయాన్ని ఏబీవీపీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తూ, నిరసనకు దిగారు. ఇది సనాతన సంస్కృతికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలో భాగమని మండిపడ్డారు. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఖురేషీ విద్యను ఇస్లామీకరణ చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు ఏబీవీపీ నేతలు పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఏబీవీపీ కార్యకర్తల నుంచి తమకు ఫిర్యాదు కూడా అందిందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఏబీవీపీ నేత అశ్వినీ పటేల్ స్పందిస్తూ.. “500 మందికి పైగా విద్యార్థులు, వీరిలో ఎక్కువ మంది హిందూ కుటుంబాలకు చెందినవారు ఇక్కడ చదువుతున్నారు. ఇది మదర్సా కానప్పటికీ, యువతలో మతపరమైన విద్యను నాటుతున్నారు. ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్, మానవ హక్కుల కమిషన్, విద్యా శాఖ మరియు ముఖ్యమంత్రి దృష్టికీ తీసుకెళ్తాం’’ అని ప్రకటించారు.