
559views
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రార్థన సమయంలో ఖురాన్ చదివించాలని మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రారంభం సురాఫతే, రబ్బీజిద్నీతో మొదలు పెట్టాలని ఆదేశించారు. సురాఫతే అనేది ఖురాన్ లో మొదటి చాప్టర్. అల్లాను ప్రార్థించడం. రబ్బీ జిద్నీ ఇల్మా అంటే ‘‘నాకు తెలివి తేటలు ప్రసాదించు’’ అని అల్లాకు చేసే ప్రార్థన. వీటితో పాఠశాల ప్రారంభించాలని పేర్కొన్నారు.

పై విధంగా నడవాలని ప్రభుత్వం సూచించింది. లైబ్రరీ టీచర్ వార్తలు రాయాలని, దానిని ఆ టీచరే మెయింటేన్ చేయాలని, అలాగే బోర్డుపై రాయాలని కూడా ఉత్తర్వుల్లో వుంది. అసెంబ్లీ సమయంలో దీనిని సూచించాలని కూడా పేర్కొన్నారు.





