
దేశ విభజన లక్షలాది జీవితాలను విచ్ఛిన్నం చేసింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్ర హింస, లైంగిక వేధింపులకు గురయ్యారు. లక్షలాది మందిపై లైంగిక దాడులు జరిగాయి. అయితే వెలుగులోకి వచ్చినవి మాత్రం అందులో పదిశాతమే. ఇక అనాధలుగా మిగిలిన లక్షలాది పిల్లలు బాలకార్మికులు, వెట్టికార్మికులుగా మిగిలిపోయారు. ప్రభుత్వం క్యాంపులు ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదు. తేరుకున్న మహిళలను సొంత వారు కూడా ఆదరించకపోవడంతో వారి జీవితాలకు దిశలేకుండా పోయింది. ఇలాంటి వారి కథనాలను వెలికితీసిన ఊర్వశి బుటాలియా వెలుగులోకి తీసుకువచ్చిన మహిళల కన్నీటి గాథలను తెలుసుకుందాం.
బల్జిత్ ధిల్లాన్ విక్రమ్ సింగ్. లాహోర్‌లో ఎంతో ఉన్నత వర్గానికి చెందిన కుటుంబం. దేశ విభజనతో వారు అనాధలుగా మారారు. విభజన సమీపిస్తున్న కొద్దీ బల్జిత్ ధిల్లాన్ జీవితం తలకిందులైంది. అప్పటి వరకు లాహోరులో ఎంతో ఆనందంగా గడిపిన వీరి కుటుంబం దేశ విభజనకు బలైపోయింది. ఒక రోజు రాత్రి బల్జిత్ తల్లి విలువైన వస్తువులను గోడలోని రహస్య అరలో దాచి, అన్ని వదులుకుని జీపులో అమృత్‌సర్ పారిపోవాల్సి వచ్చింది. దారిలో శవాల గుట్టలు భయపెట్టాయి. దారిపోడవునా శవాలను చూశారు. బల్జిత్ తల్లి తన కళ్లలో శవాల దృశ్యాలు పడకుండా ఉండేందుకు దుప్పటా కప్పే ప్రయత్నం చేసింది. కాని ఆమె అప్పటికే అనేక శవాలను చూశారు. అతి కష్టం మీద అమృత్‌సర్ చేరుకున్నారు.
పూర్వీకుల గ్రామమైన నానికీలో విలువైన సారవంతమైన వందల ఎకరాల భూములను వదులు కుని వలసబాట పట్టారు. చివరకు నిస్సారమైన బంజరు భూమి మాత్రమే వారి కుటుంబానికి దక్కింది. రాత్రికి రాత్రి బికారులుగా మారారు. జీపుల్లో తిరిగిన వారు ఎండ్ల బండికి మారాల్సి వచ్చింది. ఆకుకూరలే గొప్ప భోజనంగా మారింది. విలాస జీవితం నుంచి అతి పేదరికంలోకి నెట్టివేయబడ్డారు.
గాయత్రి చక్రవర్తి. గాయత్రి చక్రవర్తి చిన్నపిల్లగా ఉన్నప్పుడు, బారిసాల్‌లోని ఆమె కుటుంబానికి 1946లో ఒక టెలిగ్రామ్ వచ్చింది. దాని సారాశం, ఆమె తండ్రి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు జైలు పాలయ్యారు. తండ్రి జైలుపాలు కావడంతో కోల్‌కతాలోని ఆమె మామ ఇంటికి మకాం మార్చింది. యువ గాయత్రికి ఈ మార్పు గొప్పగా అనిపించినప్పటికీ తరవాత కాలంలో కష్టాలు మొదలయ్యాయి.
1947లో విభజన తర్వాత, ఆమె తండ్రి విడుదలై కోల్‌కతాకు చేరుకున్నారు. కానీ అక్కడ కూడా అల్లర్లు మొదలయ్యాయి. 1948లో కోల్‌కతాలో మత హింస నుండి తప్పించుకోవడానికి గాయత్రి కుటుంబం మరలా బారిసాల్‌కు తిరిగి వచ్చింది. ఆమె తండ్రి కోల్‌కతాలో ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్లిపోయారు, ఆమె తల్లి అనారోగ్యానికి గురై 1949లో మరణించారు. బారిసల్‌లో రాజకీయ ఉద్రిక్తత మళ్లీ పెరగడంతో ముందే గాయత్రి ఆమె తమ్ముడుతో కలసి కోల్‌కతాకు పారిపోయారు.
తన తండ్రిని కలిసిన తర్వాత, గాయత్రి బెల్ఘారియాలోని ఒక శరణార్థి కాలనీలో స్థిరపడ్డారు. సంవత్సరాల తరబడి తిరుగుతూ గడిపారు. ఆమె బాల్యం మొత్తం నిరంతర సంక్షోభంతో నిండిపోయింది. కనీసం బడికి కూడా వెళ్లలేకపోయింది. చదువుకోవాలనే దృఢ సంకల్పంతో 21వ ఏట ప్రైవేటు విద్యను ప్రారంభించింది. 24 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. దేశ విభజన ఇలా లక్షలాది జీవితాలను ఛిన్నా భిన్నం చేసింది.
డాక్టర్ బాప్సి సిధ్వా. లాహోర్‌లోని పార్సీ కుటుంబంలో పెరిగిన డాక్టర్ బాప్సి సిధ్వా విభజన హింసను ప్రత్యక్షంగా చూశారు. తన కుటుంబంలోని తోటమాలితో కలిసి నడుస్తున్నప్పుడు ఒక సంచిలో ఒక యువకుడి శవాన్ని స్వయంగా చూశారు. ఆ దృశ్యాలు జీవితాంతం కళ్ల ముందు కదలాడాయి.
డాక్టర్ సిద్ధా వ్యక్తిగత అనుభవంతో రచించిన నవల క్రాకింగ్ ఇండియా చిత్రానికి ప్రేరణనిచ్చింది. ఆమె రచన విభజన యొక్క సంక్లిష్టతలను సంగ్రహించింది, ఆమెతో సహా లక్షలాది మంది అనుభవించిన బాధ, గందరగోళం సినిమాలో కళ్లకు కట్టారు.వివాహం చేసుకుని ముంబైకి వెళ్లిన తర్వాత, డాక్టర్ సిద్ధాకు ఇద్దరు పిల్లలు కలిగారు. ఆమె తన కొడుకును వదిలి లాహోర్‌కు వచ్చింది. కఠినమైన సరిహద్దు పరిమితుల కారణంగా, ఆమె ఒక దశాబ్దానికి పైగా అతని నుండి విడిపోయింది. సరిహద్దు నిబంధనలను వినాశకరమైనవిగా అభివర్ణించింది. ఆమె నాలుగు నెలల పాటు ప్రతిరోజూ వాఘా సరిహద్దును సందర్శించింది. తన కుమారుడు చివరకు వచ్చే రోజు వరకు ఆశతో వేచి ఉంది.
అమర్‌జిత్ కౌర్ ఇట్టెన్. బలూచిస్తాన్‌లో ఒక సంపన్న ఆభరణాల వ్యాపారికి జన్మించిన అమర్‌జిత్ కౌర్ ఇట్టెన్ తన ప్రారంభ సంవత్సరాలను ఆనందంగా గడిపింది. కానీ విభజన వారి కుటుంబంలో నిప్పులు పోసింది. రాత్రి రాత్రి ఓడలు బండ్లు అయ్యాయి. అమర్‌జిత్ కుటుంబం ముల్తాన్, జైపూర్ గుండా రక్తంతో తడిసిన రైళ్లలో ప్రయాణించి చివరకు ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో స్థిరపడింది. మొత్తం ప్రపంచం పతనం నుండి బయటపడటం వల్ల కలిగే భావోద్వేగ అలసటను ప్రతిబింబిచాయి. అయినప్పటికీ ఆమె కోలుకుని పశ్చిమ పటేల్ నగర్‌లో కొత్త జీవితాన్ని నిర్మించుకుంది.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో, అమర్‌జిత్ చాలా కోల్పోయింది. రెండు ఫోటోలు ఆమె జీవితాన్ని గుర్తు చేస్తుంటాయి. ఒకటి యవ్వనపు చీరలో, మరొకటి ఢిల్లీలో తన కుటుంబంతో కలసి దిగిన వలస, గుర్తింపు ఫోటో. ఆమెది 10,000 జ్ఞాపకాలలోని అనేక స్వరాలలో ఒకటి. విభజన ప్రభావం తరతరాలుగా ఎలా ప్రతిధ్వనిస్తుందో గుర్తుచేస్తుంది
.
గుణీతా సింగ్ భల్లా. 1947 లాహోర్ నుంచి ప్రాణాలతో బయటపడిని మహిళ. బాధిత మహిళల గాథలను సేకరించారు. యువ పౌర జర్నలిస్టుల అట్టడుగు స్థాయి ప్రయత్నంగా ప్రారంభమైన ఈ సంకలనం 1947 విభజన సంకలనంగా గుర్తింపు పొందింది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కెనడా, యుఎస్, యుకె అంతటా దాదాపు 400 వ్యక్తిగత కథలను సేకరించారు. మొదటి వాల్యూమ్ రూపొందించడానికి రెండు సంవత్సరాలు పట్టింది.దాదాపు 30 వాల్యూమ్‌ల వరకు కొనసాగించారు. వీటిని 40 మంది సంపాదకులు రూపొందించారు.
ఈ పుస్తకం ఒక చారిత్రక రికార్డు. ఇది ఒక సాంస్కృతిక చిహ్నం. సింధ్ కోసం అజ్రాఖ్ కళ నుండి ఢిల్లీ కోసం మధుబని వరకు, ఆఫ్ఘనిస్తాన్ నుండి మయన్మార్ వరకు అందులోని ప్రతి అధ్యాయం ఆ ప్రాంతం యొక్క సారాన్ని ప్రతిబింబిస్తుంది.




