News

విద్యార్థినిపై మతమార్పిడి వల

336views

క్రైస్తవ మిషనరీలు ఆసుపత్రులు నడుపుతాయి. విద్యా సంస్థలను నిర్వహిస్తాయి. ఇక్కడ మత ప్రచారం జరుగుతూ ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. విద్యా సంస్థలలో క్రైస్తవం వైపు మొగ్గడానికి అనువైన మానసిక స్థితిని చిన్నారులలో తెచ్చే ప్రయత్నం కూడా ఏనాటి నుంచో జరుగుతున్నది. ఇందుకు తాజా ఉదాహరణ రాజస్థాన్లో జరిగింది. సికార్ జిల్లాకు చెందిన ఒక పెద్దాయన ఇచ్చిన పోలీస్ ఫిర్యాదు మేరకు ఈ విషయం బయటపడింది.

ఆరో తరగతి చదువుతున్న తన మనుమరాలిని మతం మార్చడానికి సెయింట్ జేవియర్ స్కూల్ ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయురాలు ప్రయత్నించారని భన్వర్సింగ్ నీమ్ కా ఠాణా పోలీస్ స్టేషన్లో జూలై 24న ఫిర్యాదు చేశారు. ఆ టీచర్ హిందూ దేవీదేవతలను అసభ్య పదజాలంతో దూషిస్తే తన మనుమరాలు అభ్యంతరం చెప్పిందని , దీనితో ఆమెపై చేయి చేసుకున్నారని సింగ్ ఆరోపించారు. అయితే ఇదంతా అభూత కల్పన మాత్రమేనని, ఆ విద్యార్థిని హోమ్ వర్క్ చేసిందో లేదో తనిఖీ చేయడానికే ఆ టీచర్ పిలిచిందని ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చింది. అంతేకాదు, హోంవర్క్ చేయనందుకు ఒకసారి విద్యార్థిని తల్లిని కూడా పిలిచామని, పిల్లను దారిలో పెట్టడానికి బెత్తం ఉపయోగించినా ఫరవాలేదని ఆమె చెప్పారని కూడా ప్రిన్సిపాల్ చెబుతోంది. ఆ విద్యార్థిని ఆ టీచర్ కొట్టిన మాట నిజం, ఈ ఉదంతం మీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి అమితోశ్ పారిక్ కోరారు