News

దేవాదాయ శాఖ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

324views

దేవాదాయ శాఖ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  చిట్టెమ్మ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 8,770 ఎకరాల  దేవాదాయ శాఖ భూములు ఉన్నాయని, అందులో 1,343 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని,  వీటిని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 2023వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం  జీవో నెంబర్ 60 ద్వారా ఆలయాల భూములు పరిరక్షించడానికి నూతన కమిటీని ఏర్పాటు చేసిందని,  ఈ కమిటీలు సభ్యులు జిల్లా స్థాయి ఇంటర్‌ డిపార్టమెంటల్ కమిటీ సభ్యులుగా జిల్లా కలెక్టర్  ఛైర్మన్ గా ఉంటూ జిల్లా పోలీస్ అధికారి, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎండౌమెంట్స్ అధికారి  అసిస్టెంట్ కమిషనర్ , జిల్లా రిజిస్ట్రార్ సభ్యులుగా ఉంటారని,  దేవాలయం భూమిని వేలంలో లీజుకు ఇవ్వాలన్నారు.