News

అధికారంలోకి వస్తే ఆర్ఎస్‌ఎస్‌ను నిషేధిస్తాం.. ఖర్గే అనుచిత వ్యాఖ్యలు

156views

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రిగా ఉన్న ప్రియాంక్ ఖర్గే నోరు పారేసుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తిరిగి వస్తే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ ను నిషేధిస్తామని అవాకులు చెవాకులు పేలారు. ఆర్ఎస్ఎస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తింపచేస్తోందని తప్పుడు ఆరోపణలు చేశారు.

ప్రియాంక్ ఖర్గే తన వాదనల్ని సమర్థించుకోవడానికి కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు. గతంలో ఇందిరా గాంధీ కూడా ఆర్ఎస్ఎస్‌ని నిషేధించారని చెప్పారు. దేశ హితానికి దోహదపడుతున్న ఆర్ఎస్ఎస్ ఇటువంటి ప్రేలాపనలు చేసిన ఖర్గేపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ మైలేజీ కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయననే చిక్కుల్లోకి నెట్టేశాయి. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఆరెస్సెస్ ఓ ఫొటోను, వీడియోను బయటపెట్టింది.

2002లో ఆరెస్సెస్ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే.. చిక్కుల్లో పడ్డ ప్రియాంక్ ఖర్గే

ప్రియాంక్ ఖర్గే తండ్రి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 2002 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించిన ‘‘సమరసతా’’ కార్యక్రమానికి హాజరైన ఓ ఫోటోను, వీడియోను బయటపెట్టింది. దీంతో ప్రియాంక్ ఖర్గే చిక్కుల్లో పడ్డారు.

37 సెకన్ల నిడివి గల్ల ఈ వీడియో ఇది. ఎస్.ఎం కృష్ణ కర్నాటక ముఖ్యమంత్రిగా వున్న సమయంలో మల్లికార్జున ఖర్గే హోంమంత్రిగా చేశారు. 2002 సంవత్సరంలో జనవరి 25 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకూ బెంగళూరులోని నాగవారాలో సంఘ్ ఓ కార్యక్రమం నిర్వహించింది. దీనికి మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు కూడా. ఖర్గేతో పాటు మరో మంత్రి రోషన్ బేగ్, బెంగళూరు నగర మాజీ పోలీసు కమిషనర్ సాంగ్లియానా వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. దాంతో పాల్గొన్న ఓ వ్యక్తి ఖర్గేను ఉటంకిస్తూ, ఆయన సమక్షంలో కాంగ్రెస్ నాయకుడైన ఖర్గే సహితం సంఘ అభిమాని అని సంబోధించారు.