News

ఐఎన్‌ఎస్‌ తమల్‌.. భారత నౌకాదళంలోకి

127views

రష్యాలో తయారైన స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ఐఎన్‌ఎస్‌ తమల్‌ భారత నౌకాదళంలోకి చేరింది. కాలినన్‌గ్రాడ్‌లో అది జల ప్రవేశం చేసింది. 125 మీటర్ల పొడవు, 3,900 టన్నుల బరువున్న ఈ యుద్ధ నౌక భారతీయ, రష్యన్‌ అత్యాధునిక సాంకేతికతల మిశ్రమంగా అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు యుద్ధ నౌక ‘ఉదయ్‌గిరి’ కూడా ముంబైలో నౌకాదళంలో చేరింది. ప్రాజెక్ట్‌ 17ఏ కింద తయారైన స్టెల్త్‌ టెక్నాలజీ యుద్ధ నౌకల్లో ‘ఉదయ్‌గిరి’ రెండోది అని అధికారులు తెలిపారు.