News

భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు

298views

ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అరసవల్లి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారి మరియు డిప్యూటీ కమిషనర్ కె ఎన్ వి డి ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవస్థానం ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రసాదం పథకం కింద ఈ ఆలయాన్ని ఎంపిక చేసిందని, త్వరలో నూతన మాస్టర్ ప్లాన్ తయారుచేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించి యుద్ధప్రాతిపదికన అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మిగిలిన ఆలయాల తరహాలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహ్లాద కరమైన వాతావరణం, పరిశుభ్రత ఉండే విధంగా నిత్యం ఆలయాన్ని తయారు చేస్తామని చెప్పారు. ఆలయ పరిసరాల్లో ఉన్న ప్రైవేట్ భూమి కొనుగోలు చేసి ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ప్రముఖ ఆలయాల జాబితాలో అరసవల్లి ఉన్నప్పటికీ ఇక్కడ భక్తులకు కనీస వసతులు లేని విషయాన్ని గుర్తించామని, త్వరలో ప్రజాప్రతినిధులు, అర్చక స్వాములు, భక్తులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికు తగు సూచనలు సలహాలు స్వీకరించి తదనుగుణంగా పనులు చేస్తామని చెప్పారు.. దేశంలో నిత్య పూజలు అభిషేకాలు అర్చనలు అందుకునే ఆదిత్యుని సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిత్యం జరిగే విధంగా ఒక ప్రత్యేక కల్యాణ వేదిక నిర్మిస్తామని అన్నారు.