
225views
తెలంగాణ ప్రభుత్వం కొత్త గోశాలలు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నందుకు మంచి పరిణామమని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను కబేళాల్లో అక్రమంగా చంపుతున్నారని ఆరోపించారు. దీన్ని నివారించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరారు.
‘‘మోడల్ గోశాలలు నిర్మించే నిర్ణయం చాలా మంచిది. గో రక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. అందులో నన్ను కూడా సభ్యుడిగా నియమించండి. తెలంగాణలో గోవధను నిషేధించాలి’’ అని రాజాసింగ్ కోరారు.





