
ఆరోగ్య భారతి, నంద్యాల శాఖ ఆధ్వర్యంలో నీతు ఆయుర్వేద వైద్యశాల మరియూ పంచకర్మ సెంటర్ వారి సహకారంతో 15.06.2025 ఆదివారం నాడు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం స్థానిక శ్రీమతి సుబ్బమ్మ మరియు బాలాజీ మర్చంట్స్ కమిటీ కళ్యాణ మండపం, బాలాజీ కాంప్లెక్స్ నందు నిర్వహించడం జరిగినది.

ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో డాక్టర్ బాల వెంకట కృష్ణ ఎండి ఆయుర్వేద, డాక్టర్ జె. శ్రావణ సంధ్య.ఎండి ఆయుర్వేద గారలు నడుము, మెడ, భుజము మోకాలు, సోరియాసిస్, చర్మవ్యాధులు, గ్యాస్ సమస్యలు, మొలలు, మలబద్ధకం, రక్తహీనత, స్రీ సంబంధిత వ్యాధులు, గర్భాశయంలో గడ్డలు, (ఫైబ్రాయిడ్స్), అతిమూత్ర వ్యాధి, సుగర్, బీపీ, కొలెస్ట్రాల్, సెక్స్ సమస్యలు, ఆస్తమా, దగ్గు, జలుబు మొదలు సమస్యలకు దాదాపు 100 మందికి పైగా రోగులను పరీక్షించి లక్ష రూపాయలు విలువగల ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి సభ్యులు డా. పరమేశ్వరరెడ్డి, శ్రీ టి చెన్నకేశవులు, శ్రీమతి ఉమాదేవి, శ్రీ కె. విజయభాస్కర్ రెడ్డి, శ్రీకశెట్టి కృష్ణమూర్తి, (బాలాజీ కళ్యాణ మండపం అధ్యక్షులు)
శ్రీ మునీంద్ర,శ్రీ కృష్ణ, శ్రీ చింతలపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు.





