News

క్రిస్టియన్ల సమావేశాల్లో చైనా, పాక్ జెండాలు.. పాస్టర్లపై కేసులు

227views

కేరళలోని కొచ్చిలో వివాదాస్పద సంఘటన జరిగింది. త్రిప్పునితుర ప్రాంతంలో పెంటెకోస్టల్ అనే క్రిస్టియన్ బృందం ప్రార్థనలు నిర్వహించింది. 40 రోజుల పాటు సాగిన ఈ ప్రార్థనల్లో భారత జాతీయ జెండాతో పాటు, పాక్, చైనా జాతీయ జెండాలను కూడా అక్కడి పాస్టర్లు ఎగరేశారు. దీనిపై జాతీయవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. కందనాడులోని జీసస్ జనరేషన్ ఆడిటోరయంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల్లో కొందరు దీనిని గమనించి, బయటికి తేవడంతో అసలు విషయం బట్టబయలైంది.

ఈ విషయం బయటకు రాగానే ఎర్నాకుళంలోని హిందువులు, బీజేపీ కార్యకర్తలు ఘటనా స్థలికి చేరుకున్నారు. కార్యక్రమ వేదిక బయట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని, చైనా, పాక్ జాతీయ జెండాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు, పాస్టర్లపై కేసులు నమోదు చేశారు.

ఉదయంపేరూర్ కి చెందిన క్రిస్టియన్ పాస్టర్ దీపు జాకబ్ ఆధ్వర్యంలోనే ఈ ఆడిటోరియం వుంది. దాదాపు 40 రోజుల పాటు సాగిన ఈ ప్రార్థనా సమావేశాల్లో 200 మంది హాజరయ్యారు. పాక్, చైనా జెండాలను ఎగరేయడంపై పోలీసులు జాకబ్ ను ప్రశ్నించగా… తాను చైనా పర్యటన సందర్భంగా పాక్ జెండాను కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చాడు.

దీంతో జాకబ్ ను విచారించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత వదిలేశారు. దీనిని జాతీయవాదులు, హిందువులు, బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పాక్, చైనా జెండాలను ఎగరేసి, భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని అవమానించడాని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

అయితే.. తాను ప్రపంచ శాంతి కోసమే ఈ ప్రార్థనా సమావేశాలను నిర్వహిస్తున్నానని అందుకే పాక్, చైనా జెండాలతో సహా మరో 20 దేశాల జాతీయ జెండాలను వుంచినట్లు చెప్పుకొచ్చారు.