News

మంత్రి గారి ‘‘పైత్యం’’… తొక్కిసలాటను, దేవాలయాల సందర్శనతో పోల్చడమా?

201views

పోలికకూ ఓ అర్థం వుండాలి. ఓ సందర్భమూ వుండాలి. ఓ సంఘటన జరిగినప్పుడు దేనితో పోల్చాలి? అన్న ఇంగితమైనా వుండాలి. కానీ.. డీఎంకే మంత్రి, హిందూ ధర్మ ద్వేషి, క్రైస్తవ అభిప్రాయాలను బలంగా విశ్వసించే మనో తంగరాజ్ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని చిన్న స్వామి స్టేడియం వద్ద బుధవారం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇంత విషాద ఘటన జరిగితే.. డీఎంకే మంత్రి తంగరాజ్ మాత్రం హిందూ ధర్మంపై ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడారు.సంతాపం ప్రకటించడమో, వారి బాగోగుల గురించి మాట్లాడటమో కాకుండా, అర్థం పర్థంలేని పోలిక తీసుకొచ్చి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ‘‘దేవాలయాలకైనా సరే హిందువులు ఇలా గుంపులు గుంపులుగా వెళ్లడం మంచి సంస్కృతి కాదు.’’అంటూ విద్వేషకర వ్యాఖ్యలు చేశారు.

దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో కల్తీ మద్యం మరణాలు, నేరాలు, అవినీతి లేనిది ఓ రోజు కూడా గడవదని, అవేవీ పట్టించుకోకుండా హిందువుల దేవాలయాల సందర్శనపై విమర్శలు చేస్తున్నారని అన్నామలై మండిపడ్డారు.తన హేతువాదాన్ని నిరూపించుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలని మండిపడ్డారు.

ఇక.. ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సూర్య కూడా మండిపడ్డారు. హిందువులు దేవాలయాలను సందర్శించడం మంచి సాంస్కృతిక సంకేతం కాకపోతే, మంత్రి అర్చకులు, బిషప్ లను ఎందుకు కలుస్తారో? అంటూ ప్రశ్నించారు. ఆయన చెప్పేది నకిలీ లౌకికవాదం అని మండిపడ్డారు.