
శ్రీ వెంకటేశ్వర స్వామి నగరమైన తిరుపతిలో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ అంతర్జాతీయ స్థాయి లులు మాల్‌ను అనుమతించడం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుందని, అందువల్ల, తిరుపతిలోని లులు మాల్‌కు అనుమతిని రద్దు చేయాలని కోరుతూ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్-GHHF రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లులు మాల్‌కు అనుమతి ఇవ్వవలసి వస్తే, తిరుమల, తిరుపతి మరియు తిరుచానూరులకు 75 కి.మీ అవతల ఇవ్వాలని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు తిరుపతి పవిత్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫౌండేషన్ 2025 ఏప్రిల్ 20న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ పంపింది.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీని కలిశారు. ఈ సమావేశం సంర్బంగా వైజాగ్‌లో మాల్స్ మరియు మల్టీప్లెక్స్‌లు, విజయవాడ మరియు తిరుపతిలో హైపర్ మార్కెట్‌లు మరియు మల్టీప్లెక్స్‌లను ఏర్పాటు చేసే ప్రణాళికలను, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆహార ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను గురించి చర్చించినట్లు చంద్రబాబు ప్రకటించారు.
ఈ నేపధ్యంలో లులు మాల్ నిర్మాణాన్ని అనుమతించే ముందు హిందువుల ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై పరిణామాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని GHHF పేర్కొంది.ఈ నిర్ణయం తిరుమల పవిత్రతకు హిందూ యాత్రికుల భద్రతకు ఆటంకం కలిగించవచ్చని, తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఆలయ పవిత్రతకు దెబ్బతింటుందని తెలిపింది.
ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది.





