
శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. భజేహం పవిత్రం.. అంటూ భక్తులు హనుమంతుడిని భక్తితో కొలిచారు. జై హనుమాన్.. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. హనుమత్ జయంతి సందర్భంగా గురువారం వాడవాడలా అభయాం జనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వహిందూ పరిషత్ మహానగర్ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శైవపీఠాధిపతి శివ స్వామి ర్యాలీని ప్రారంభించారు. భారీ సంఖ్యలో హాజరైన హనుమాన్ భక్తులు జెండాలు చేత పట్టుకొని ఉత్సాహంగా ముందుకుసాగారు. మహిళలు కూడా బైక్ పైకి ఎక్కి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు
హిందూ ఆలయాలకు, వాటి ఆస్తులకు రక్షణలేకుండా పోయిందని శైవ పీఠాధిపతి శివస్వామి పేర్కొ న్నారు. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. విశ్వహిందూ పరిషత్ మహా నగర్ ఆధ్వర్యంలో గురువారం బీఆర్డీఎస్ రోడ్డులో హనుమత్ జయంతి సందర్భంగా నిర్వ హించిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ.. హనుమత్ జయంతిని విజయ్ దివస్ గా భావించాలని శైవ పీఠాధిపతి శివస్వామి సూచించారు. హనుమంతు డిలోని కార్యదీక్షను ప్రతి ఒక్కరూ అలవాటు చేసు కోవాలన్నారు. మాతా శివానంద సరస్వతి మాట్లా డుతూ.. సర్వహిందువులు ఏకం కావాల్సిన
అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలోనూ రామ మందిరాలను నిర్మించాలన్నారు. విశ్వహిందూ పరి షత్ నాయకులు సుబ్బరాజు, పుట్టగుంట సతీష్, నగరశాఖ అధ్యక్షుడు సానా శ్రీనివాస్, కార్యదర్శి క్రోవి రామకృష్ణ, కోశాధికారి పేర్ల రవీంద్రగుప్తా, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరారవు, బీజేపీ నాయకులు నాగలింగం శివాజీ, తూములూరి చైతన్య శర్మ పాల్గొన్నారు.
శోభాయమానంగా బైక్ ర్యాలీ
విజయవాడలో నగరంలోని పాత బస్తీ, సింగ్నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కృష్ణలంక, పాయకాపురం ప్రాంతాల నుంచి హనుమాన్ భక్తులు ర్యాలీగా బీఆర్ఎస్ రోడ్డు లోని ఆదిశంకర సర్కిల్ చేరుకున్నారు. అనం తరం బైక్ ర్యాలీ శోభాయమానంగా సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. జై శ్రీరాం నినాదాలలో ర్యాలీ మార్మోగింది.