News

బలవంతపు మత మార్పిడి.. ఛత్తీస్ గఢ్ లో బట్ట బయలు

313views

ఛత్తీస్ గఢ్ లోని కబీర్దామ్ జిల్లాలో జరుగుతున్న మత మార్పిడి రాకెట్ ను బట్టబయలు చేశారు హిందువులు. ఓ ఇంటి కేంద్రంగా బలవంతపు మత మార్పిళ్లు జరుగుతున్నాయని, వెంటనే పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని హిందువులు డిమాండ్ చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు. ఓ క్రిస్టియన్ పాస్టర్, అతని భార్య కలిసి ఇంటి కేంద్రంగా ఈ పని చేస్తున్నారు. వైద్య చికిత్సలు చేస్తామంటూ హిందువులను మోసం చేస్తున్నారని, వైద్యం పేరుతో మభ్య పెడుతూ బలవంతపు మత మార్పిళ్లకు దిగుతున్నట్లు హిందువులు గుర్తించారు. చట్ట విరుద్ధమైన మార్గాల ద్వారా మత మార్పిళ్లు చేస్తున్నారని మండిపడ్డారు.ఆదివారం రోజున పాస్టర్ ఇంట్లోనే ఈ మత మార్పిడి తతంగం జరుగుతుందని హిందూ కార్యకర్తలకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.

‘ఈ ప్రాంతంలో చాంగై సభ జరుగుందని మాకు సమాచారం అందింది. బలవంతంగా ప్రజలను కూడా పిలిపించినట్లు తెలిసింది. గుమిగూడిన వారిని అడిగాం. తాము హిందువులని ప్రకటించారు. ప్రార్థన కోసం ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఇది ఇల్లు కాదని, చర్చి అని చెప్పారు’’ అని హిందూ కార్యకర్తలు పేర్కొన్నారు. అలాగే ఇంకా ఏం చేస్తున్నారన్న దానిపై క్లారిటీ రావడానికి సీసీ టీవీలను పరిశీలించాని హిందూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పాస్టర్ ఇంట్లో జరిగిన రహస్య సమావేశానికి సుమారు 20-25 మందిని పిలిచారని, ఈ వార్త స్థానికులను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. వారానికి రెండు సార్లు ఇలాగే పిలుస్తారని అక్కడి ప్రజలు వెల్లడించారు.