
362views
నంద్యాల నగరంలో స్టేట్ బ్యాంకు కాలనీ రామాలయంలో తలసేమియా డే సందర్బాన్ని పురస్కరించుకొని సక్షమ్ (సమదృష్టి , క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి) దివ్యాoగుల కోసం పని చేస్తున్న అఖిల భారత సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా కుటుంబాల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ నెల 18-5-2025 ఆదివారం ఉదయం 10-00 గంటలకి జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిన్నపిల్లల డాక్టర్ సతీస్ రెడ్డి తలసేమియా పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, ఇనుప ధాతుస్థాయిలు వంటి విషయాలపై అవగాహన కలిగించారు.

పిల్లలకు ఆటల పాటలతో, పొడుపు కథలతో, తల్లిదండ్రుల ఆటలతో, ఆనందంగా గడపారు.
అనంతరం 28 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సక్షమ్ కార్యకర్తలు పాల్గొన్నారు.





