
సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ సారధ్యంలో వివేకానంద విద్యానికేతన్ సంస్థ నిర్వహించే 10 పాఠశాలలకు చెందిన 177 ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు అమరావతిలోని “75 త్యాల్లూర్” గ్రామంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ కళలను విద్యార్థులకు ఎలా బోధించాలి, ఎలా నేర్పించాలి, కళాకారులను ఎలా గుర్తించాలి, వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలి అనే అంశాలపై పై మే 8, 9 తేదీలలో ప్రదర్శనలతో కూడిన శిక్షణా తరగతులు నిర్వహించారు. సంస్కార భారతి సారధ్యంలో డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయి బాబా నాట్యమండలి విజయవాడకు చెందిన 10 మంది కళాకారులు డాక్టర్ పివిఎన్ కృష్ణ సారధ్యంలో భరతనాట్యం, కూచిపూడి, జానపదం, దేశభక్తి గీతాలు, నాటిక, పద్య నాటకం, ఏకపాత్రలు మొదలైనవి నేర్పించడం జరిగింది నిర్వాహకులు తెలిపారు. వాటిలో నవీన భారతం, సత్యాస్వాంతనము, నాయకి నాగమ్మ, మొదలగు ఏకపాత్రలు జయహో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ నాటకంలో ఒక ఘట్టం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా వివేకానంద విద్యానికేతన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ శ్రీ దుర్గాప్రసాద్ రాజు మాట్లాడుతూ చిన్నతనం నుండి పిల్లలకు భారతీయ చారిత్రక వీరుల వీరనారీమణుల గొప్పతనాన్ని వారి త్యాగాలను తెలిసే విధంగా చరిత్రను కళల ద్వారా పిల్లలకు నేర్పవలసిన అవసరం ఉంది అన్నారు.ఈ శిక్షణా కార్యక్రమంలో కళాకారులు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, శ్రీ జొన్నలగడ్డ శ్రావణ్ కుమార్, శ్రీ పి సాయి శంకర్, శ్రీ బి అనంత శ్రీ చరణ్, కుమారి జి ఎన్ డి కుసుమ సాయి, కుమారి బీ రుపా శ్రీ, శ్రీరజిత్ రాజీవ్, శ్రీ రాజేంద్రప్రసాద్, శ్రీ పరబ్రహ్మచారి మొదలైన కళాకారులు పాల్గొన్నారు,






