
విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నంద్యాలలోని జి. పుల్లారెడ్డి భవన్, విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం ప్రేరణ దాయకంగా జరిగింది.
ఈ నెల 22వ తేదీ నిర్వాహించనున్న వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. దేశమంతటా ఈ శోభాయాత్ర యొక్క ప్రాముఖ్యతను, దానిని విజయవంతం చేయాల్సిన అవసరాన్ని పెద్దలు కార్యకర్తలకు తెలియజేశారు.
కాగా అంతకుముందు శోభాయాత్రకు సంబంధించిన గోడ పత్రికలు, బ్యానర్లు మరియు స్టిక్కర్లను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ దక్షిణ ఆంధ్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా సంఘచాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్, విభాగ్ సహ కార్యవాహ శ్రీ రామాంజనేయులు, జిల్లా కార్యవాహ శ్రీ అల్లం రఘురాములు, శోభాయాత్ర ప్రముఖ్ శ్రీ జానపల నాగరాజు, సహ ప్రముఖ్ శ్రీ రాంప్రసాద్, ఇతర సంఘ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర సంస్థల కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు.





