
345views
శ్రీవారి మహిమలు అన్నమయ్య కీర్తనల ద్వారా విశ్వవ్యాప్తమయ్యాయని రాజంపేట శాసనసభ్యుడు, ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. తాళ్లపాకలో అన్నమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా ధ్యానమందిరంలోని అన్నమాచార్యుని దర్శించుకున్నారు. ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తన గానంతో వెంకటేశ్వరస్వామి హృదయంలో స్ధానం కలిగిన అన్నమయ్యతో ఎవరు కూడా సాటిరారన్నారు. స్వామి అనుగ్రహంతో ఎవరూ ఈ సృష్టిలో రచించిలేని రచనలు ప్రారంభించిన అద్భుతమైన ప్రాంతం అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక అన్నారు. వెంకటేశ్వరస్వామి మహిమలు, మహాత్యం.. తెలియలాంటే అన్నమయ్య కీర్తనలు విశ్వవ్యాప్తం కావాలన్నారు. స్వామివారిని ప్రత్యక్షంగా చూసిన, స్వామివారి అందాలను తన కీర్తనలతో అభివర్ణించి తెలియచేసిన మహాజ్ఞాని అన్నమయ్య అని కొనియాడారు.





