
238views
పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయ అధికారికి దేశ కీలక సమాచారం అందించారనే ఆరోపణలతో పంజాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. మన సైన్యానికి చెందిన సున్నిత సమాచారాన్ని పాక్ అధికారికి వీరు చేరవేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. ఈ వ్యవహారంలో పంజాబ్‌లోని మలేర్‌కోట్లకు చెందిన గుజాలా, యమీన్ మహ్మద్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రహస్య సమాచారం చేరవేసినందుకు ప్రతిఫలంగా ఆన్‌లైన్ ద్వారా కొంత మొత్తాన్ని నిందితులు స్వీకరించినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.





