
ఆధ్యాత్మిక సంస్థలు తత్వశాస్త్రానికి కేంద్రంగా నిలుస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా అన్నారు. తమిళనాడు చెన్నై సమీపంలో జరిగిన 6వ అంతర్జాతీయ శైవసిద్ధాంత సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. శైవ సిద్ధాంతం కేవలం తత్వశాస్త్రం మాత్రమే కాదని, తమిళనాడు ప్రజల సంస్కృతిలో ఇమిడిపోయిందన్నారు. పవిత్ర కళలు, దేవాలయాల ద్వారా ఇది తత్వశాస్త్రాన్ని పోషించిందని అన్నారు. “తమిళనాడు ఒక ధన్య భూమి. సంగం కవులు మరియు శైవ సాధువులు దాని పవిత్ర దేవాలయాలు, కళలు మరియు సాహిత్య సంపదల ద్వారా ఈ తత్వాన్ని పోషించారని అన్నారు. అప్పర్ [తిరునావుక్కరసర్], సుందరర్ మరియు తిరుజ్ఞానసంబంధర్ సాధువులు రచించిన “పవిత్ర తేవరం” దైవిక శక్తిని బోధిస్తుందని సాధువు మాణిక్య సాగర్ రాసిన “పవిత్ర తిరువాసగం” గొప్ప రచనలు అని తెలిపారు. శైవ సిద్ధాంతం మానవాళికి ఒక సందేశమన్నారు.
ఈ సమావేశంలో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి మాట్లాడుతూ, శైవ ఆగమాలు అత్యంత తాత్వికమైనవి మరియు అత్యంత మేధోపరమైనవి అని అన్నారు. దీనిని అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి అత్యున్నత పాండిత్యం అవసరమన్నారు. “ఇది మొత్తం భారత దేశాన్ని ప్రకాశవంతం చేసిందని. తమిళ శైవ సాధువులు – నాయనార్లు విప్లవాత్మక పనులు చేశారని అన్నారు.వారు తమిళ భాషలో శైవ సిద్ధాంతాన్ని ప్రబోధించారని, తద్వారా
శైవం ప్రజలకు సులభంగా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
ధర్మపురం అధినం 27వ గురు మహాసన్నిధానం శ్రీ-ల-శ్రీ కాయిలై మాసిలామణి దేశిక జ్ఞానసంబంధ పరమాచార్య స్వామి మాట్లాడుతూ, మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో శైవ సిద్ధాంతంపై 300కు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమవుతున్నాయన్నారు.





