News

ఇది జయాపజయాలకు అతీతమైనది – డాక్టర్ మోహన్ భాగవత్

546views

రోజు మధ్యాహ్నం 1 గంటకు జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అయోధ్య రామజన్మ భూమి విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును స్వాగతించారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన విచారణలో అన్ని పక్షాల వాదనలనూ ఓపిగ్గా విన్న అత్యున్నత న్యాయస్థానం నేడు అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పును వెలువరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ వివాద పరిష్కారం కోసం అనేకమంది చేసిన యోగదానం, బలిదానం స్మరించుకోవలసిన రోజు నేడు అని తెలిపారు. కోర్టును ఆశ్రయించిన అన్ని పక్షాలు,సర్కారు, సామాన్యులు అందరి యొక్క నిరీక్షణ ఫలించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం నేడు లభించిందన్నారు. ఇది ఎవరి విజయమూ కాదు. అలాగే ఎవరి పరాజయమూ కాదు. అసలు ఆ ప్రస్తావన అవసరం లేదు అని పేర్కొన్నారు. అందరమూ సర్వోన్నత న్యాయస్థానం యొక్క ఈ నిర్ణయాన్ని శిరసా వహించాలని, అందరం కలిసి సర్వోన్నత న్యాయస్థానం రామ జన్మ భూమి న్యాస్ కు అప్పగించిన ఆ స్థలంలో దివ్యమైన, భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఆ ప్రక్రియను ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తుందని ఆశిద్దామన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.