
న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో నమోదైన పరువు నష్టం కేసులో సోమవారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనమ్ ఖాన్ ఈ ఆదేశాలు ఇచ్చారు.
వికాస్ సంస్కృతాయన్ అలియాస్ వికాస్ పాండే దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు కొనసాగుతోంది. ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానల్లో వికాస్ పాండేకు వ్యతిరేకంగా ఓ వీడియోను అప్లోడ్ చేయడంతో ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
ఈ కేసులో గతంలోనూ కోర్టు పలుమార్లు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అక్టోబర్ 17, అక్టోబర్ 31 తేదీల్లో వారెంట్లు జారీ చేసినప్పటికీ రాఠీ కోర్టుకు హాజరు కాలేదని తెలుస్తోంది. నోటీసులు అందించేందుకు వెళ్లిన ప్రాసెస్ సర్వర్‌కు ఆయన నివాసం తాళం వేసి కనిపించడంతో తదుపరి చర్యలు చేపట్టారు. అనంతరం హర్యానాలోని గురుగ్రామ్ చిరునామాకు సమన్లు పంపించారు.
మరోవైపు, ధ్రువ్ రాఠీ సాధారణంగా ఆస్ట్రియాలో నివసిస్తారని, ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. కోర్టు పూర్తి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.





