
254views
వక్ఫ్ (సవరణ) చట్టం చేసినందుకు ప్రధాని మోదీకి దావూదీ బొహ్రా ముస్లింలు ధన్యవాదాలు తెలిపారు. సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తంచేశారు. వీరు గురువారం ప్రధానిని కలిశారు. షియా ముస్లింలలో దావూదీ బొహ్రాలు జనాభాపరంగా మైనారిటీలు. ఆర్థికంగా వీరు బలమైన వర్గం. వక్ఫ్ బిల్లుపై ఏర్పడిన పార్లమెంటరీ సంయుక్త కమిటీకి గతంలో దావూదీ బొహ్రాలు తమ సిఫారసులను సమర్పించారు. వీటి ఆధారంగా చట్టంలో ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది. ‘‘దావూదీ బొహ్రా సమాజానికి చెందిన సభ్యులతో అద్భుతమైన సమావేశం జరిగింది. అనేక అంశాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నాం’’ అని ‘ఎక్స్’ వేదికగా మోదీ పేర్కొన్నారు.





