ArticlesNews

రేపిస్టు పాస్టర్ గుట్టు రట్టు – ఆట కట్టు.

242views

క్రైస్తవ సువార్తికులు, భారతదేశములోని వివిధ ప్రాంతాలలో సాధారణ ప్రజానీకాన్ని ప్రభావితం చేసి, వారిని మతం మార్చటానికి అనైతిక మరియు నకిలీ పద్ధతులను ఉపయోగించడం సర్వసాధారణం. ఒడిశాలోని ప్రవుల్ లో గల ఒక పాస్టర్ ఇలాంటి నకిలీ ‘స్వస్థత’ చేకూర్చటంలో ప్రసిద్ధులు, అత్యాచారానికి పాల్పడిన నిందితులు కూడా. “చర్చ్ ఆఫ్ గ్లోరీ అండ్ విజ్డం” అధ్యక్షుడైన మిస్టర్ బాజిందర్ సింగ్, తనను తాను ‘ప్రవక్త’ గా అభివర్ణించుకుంటారు. ఈయన ఆధ్వర్యంలో ఓడిశాలోని కోరాపుట్ జిల్లాలోని కంకదాంబో అనే మారుమూల గ్రామంలో అమాయక జన జాతుల మత మార్పిడులే లక్ష్యంగా భారీ స్థాయిలో స్వస్థత సభలు ఏర్పాటు చెయ్యబడుతున్నాయి.

బాజిందర్ సింగ్ ఆధ్వర్యంలో ‘బిగ్ హీలింగ్ క్రూసేడ్’ పేరుతో జరిగే ఈ స్వస్థత సభలను రద్దు చేయాలని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్ ఆర్ పి ఎఫ్) కోరాపుట్ జిల్లా మేజిస్ట్రేట్ కి, ఎస్. పికి విన్నవించింది. 1954లో చేసిన చట్టంలోని 5వ నిబంధన ప్రకారం బాజీందర్ సింగ్ చర్యలు మోసపూరిత ప్రకటనల కిందికి వస్తాయని, కనుక వారిపై చర్యలు  తీసుకోవాలని ఎల్ ఆర్ పి ఎఫ్ తన ఫిర్యాదులో పేర్కొంది.

పౌరులందరికీ మత స్వేచ్ఛను ప్రసాదిస్తూ 1967లో ఒడిశా ప్రభుత్వం రూపొందించిన చట్టానికి కూడా వీరి ‘ఈ హీలింగ్ క్రూసేడ్’ విరుద్ధంగా ఉన్నదని ఎల్ ఆర్ పి ఎఫ్ తన ఫిర్యాదులో పేర్కొంది. “ఆ చట్టంలోని మూడవ నిబంధన ప్రకారం ఏ వ్యక్తినీ తన స్వధర్మం నుంచి పర ధర్మం లోకి మార్చడం గానీ, అందుకు యత్నించడం గానీ,  ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అందుకు ఒత్తిడి చేయడం గానీ, ప్రలోభ పెట్టడం గానీ, మోసపూరిత ప్రకటనల ద్వారా,  చర్యల ద్వారా ఆకర్షించడం గాని నేరం. ఇప్పుడు వీళ్ళు నిర్వహిస్తున్న ఈ ‘హీలింగ్ క్రూసేడ్’ కార్యక్రమం ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉంది.” అని ఎల్ ఆర్ పి ఎఫ్ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఎల్ ఆర్ పి ఎఫ్ అధ్యక్షులు శ్రీ ఏ ఎస్ సంతోష్ కోరాపుట్ జిల్లా వైద్యాధికారికి కూడా ఆయన విధులు, అధికారాలు, చట్టంలోని నిబంధనలు గుర్తు చేస్తూ, ఈ స్వస్థత సభల నిర్వాహకులు వాటిని ఎలా అతిక్రమిస్తూ ఉన్నారో కూడా తెలియజేస్తూ ఘటనపై వారి తక్షణ జోక్యాన్ని కోరారు.

సభలు నిర్వహిస్తున్న పాస్టర్ రేప్ కేసులో నిందితుడు

చండీఘడ్ కి చెందిన పాస్టర్ బాజీందర్ సింగ్ ఒక అత్యాచార కేసులో నిందితుడు. ఏప్రిల్ 2018లో తన సహాయకురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆయనపై అభియోగాలున్నాయి. తనను బోర్డు సభ్యురాలిని చేస్తానని నమ్మించి చండీఘడ్ లోని తన ఇంటికి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని, అంతటితో ఆగక ఆ సంఘటనను వీడియో తీసి తాను చెప్పినట్లు వినకపోతే దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన పరువుకు భంగం కలిగిస్తానని బెదిరించినట్లు కూడా ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

తన పైన అభియోగం నమోదు కాగానే ఆ పాస్టర్ కనిపించకుండా పోయాడు. ఆయన కోసం చండీగఢ్ పోలీసులు నెలల తరబడి వెతికారు కూడా. ఎట్టకేలకు ఆయన విదేశాలకు పారిపోబోతుండగా జూలై 2018లో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

తన మహిమల పై అసత్యాలు, అభూత కల్పనల ప్రచారం

ఈ రేపిస్ట్ పాస్టర్ ఆదివారాలు చండీగఢ్ లో నిర్వహించే స్వస్థత సభలలో చాలామంది పాల్గొనేవారు. హెచ్ఐవి, పోలియో వంటి రోగాలను కూడా తన ప్రార్ధనలతో తగ్గించగలనని ఆయన ఆ సభలలో చెప్పుకునే వాడు. ఆయన కోమాలో ఉన్న రోగులను తన ప్రార్ధనలతో, తనకున్న అతీత శక్తులతో లేపి కూర్చోబెడుతూ ఉన్నట్లుగా ఉన్న అనేక వీడియోలు మనకు యూట్యూబ్లో దర్శనమిస్తాయి.

అంతేకాదు తాను క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నయం చేస్తానని, దయ్యాలను వదిలిస్తానని కూడా ఆయన చెప్పుకుంటాడు. ఆయన అలా చేస్తున్నట్లు చూపించే వీడియోలను కూడా ఎల్ ఆర్ పి ఎఫ్ తన ఫిర్యాదులో ఆయన మోసపూరిత, తప్పుడు మత మార్పిడి చర్యలకు ఆధారాలుగా చూపించింది.

తనమీద ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, నేటికి కూడా ఆ పాస్టర్ యొక్క కార్యక్రమాలు పంజాబీ దూరదర్శన్లో ప్రసారం అవుతుండడం హాస్యాస్పదం. ఆ కార్యక్రమాలలో బాజిందర్ బైబిల్ గురించి ఉపన్యాసాలు దంచుతూ, తనకు ఉన్నాయంటున్న అతీత శక్తుల గురించి అభూత కల్పనలతో కూడిన అతిశయోక్తులు చెప్పుకుంటూ ఉండడం మనకు కనిపిస్తుంది. ఇంతకీ ఇతను ఒక హత్య కేసులో నిందితుడుగా జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో క్రైస్తవుడిగా మారినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఎల్ ఆర్ పి ఎఫ్ తన తీవ్ర ప్రయత్నంతో నేడు, రేపు జరుగనున్న ఈ “బిగ్ హీలింగ్ క్రూసేడ్” లో బాజీందర్ మాయాజాల ప్రదర్శనకు, మతమార్పిడులకు అవకాశం లేకుండా చేయగలిగింది. కేవలం ఉపన్యాసాలతో కూడిన సభలు నిర్వహించుకోవడం కోసం మాత్రమే పోలీసులు క్రూసేడ్ బ్యాచ్ ని అనుమతించడం గమనార్హం. అంతే కాకుండా ఈ మొత్తం సభలను పోలీసులు చిత్రీకరిస్తారు కూడా. దీంతో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఈ క్రూసేడు బ్యాచ్ మత మార్పిడి దందాను నిలువరించ గలిగినట్లైంది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.